సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు.
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు అధ్యక్షతన మంగళవారం నల్లగొండ పట్టణంలోని విద్యా గ్రామర్ పాఠశాలలో నిర్వహించారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో ఘనమైన కీర్తిని గడించిన నల్లగొండ జిల్లాలోని మహిళలను.సన్మానించారు. ప్రత్యేక ఆహ్వానితులు,సన్మాన గ్రహీతలు బిసి డెవలప్మెంట్ డిడి పుష్పలత, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీ ప్రభ, డిప్యూటీ ఎమ్మార్వో బండ కవితారెడ్డి, ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ సుచరిత, ఏఎస్ఐ ఆర్ సుల్తానా, అడ్వకేట్ ఎలా గీత, మహిళ జర్నలిస్ట్ మంజుల, దుబ్బ కొండమ్మ, సదా లక్ష్మీ, జినుగు జ్యోతి రెడ్డి, లలిత, సమాచార హక్కు పరిరక్షణ సమితి గౌరవ సలహాదారు వైద్యం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు బండమీది అంజయ్య, జన విజ్ఞాన సమితి జిల్లా అధ్యక్షులు వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పుప్పాల సత్యం, సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చేపూరి సతీష్ కుమార్, మేకల పరమేష్ పాల్గొన్నారు Vaddepalli Kashi Ram